తాడేపల్లి: తాడేపల్లి పట్టణంలోని కొత్తూరులో 4, 17 వార్డుల పరిధిలో నెలకొని ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చినా పరిష్కారానికి నోచుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్థానిక మహిళలు కృష్ణుని గుడి వద్ద గల 4, 5 సచివాలయాల సెక్రటరీలకు అర్జీ అందజేశారు. గత ఆరె నెలలుగా ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నెలకొని ఉంది. వచ్చే నీరు అరకొరగా వస్తున్నారు. వాటిలో మురుగునీరే అధికంగా వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి పి.గిరిజ, స్థానిక మహిళలు బి.సీతాదేవి, కృష్ణవేణి, కె.కవిత, బి.చినలక్ష్మి, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి డివి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.










