May 25,2023 00:19

మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అద్దంకి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం కలెక్టరేట్‌ లోని స్పందన సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అద్దంకిలో ఎఎబి పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుకు రూ.82 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. అద్దంకి పట్టణ ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇతర పనులు మిగిలాయన్నారు. అన్ని మండ లాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అమత్‌ సరోవర్‌ కింద మంజూరైన రూ.8 కోట్లతో చెరువులు అభివద్ధి చేయాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య కలెక్టర్‌ దష్టికి తెచ్చారు. ఆ ప్రాంతాలలో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణానికి స్థలం కేటాయించి పనులు ప్రారంభించాలన్నారు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్మశాన వాటికలకు భూములు కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయా లన్నారు. ఆర్‌అండ్‌బి రహదారుల విస్తరణ పనులు చేపట్టాలన్నారు. జగనన్న కాలనీలకు ఉపాధి హామీ పథకం కింద అప్రోచ్‌ రోడ్లను నిర్మించాలన్నారు. నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వచ్చే నెల 12 లోపు పూర్తి చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గహ నిర్మాణాలు శరవేగంగా జరిగేలా లబ్ధిదారులకు పొజిషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. ఒటిఎస్‌ పథకం ద్వారా నగదు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌.శ్రీధర్‌, డిఆర్‌ఒ కె. లక్ష్మీశివజ్యోతి, డ్వామా పీడీ వై.శంకరనాయక్‌, రాష్ట్ర శాప్‌ చైర్మన్‌ బాచిన కృష్ణ చైతన్య , మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.