Jul 09,2023 23:12

కొళాయిని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ పొన్నాడ

ప్రజాశక్తి - తాళ్లరేవు
ముమ్మిడివరం నియోజకవర్గంలో రూ.150 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ తెలిపారు. చొల్లంగిపేట పంచాయతీ కొబ్బరి చెట్టు పేటలో ఒఎన్‌జిసి సిఎస్‌ఆర్‌ నిధులు రూ.40 లక్షలతో నిర్మించిన వాటర్‌ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ కందిళ్ళ గంగాభవాని అధ్యక్షతన జరిగిన సభలో ఎంఎల్‌ఎ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.100 కోట్లు, సిఎస్‌ఆర్‌ నిధులు రూ.50 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికీ కొళాయిలు వేస్తామన్నారు. మండలంలో 23 వాటర్‌ ట్యాంకులు నిర్మించినట్లు తెలిపారు. చొల్లంగి పేటలో రూ.74.50 లక్షలతో ఇంటింటికి కొళాయిలు, పైపులైన్లు వేస్తామన్నారు. ఎంపిపి రాయుడు సునీత, ముమ్మిడివరం ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, మాజీ సర్పంచ్‌ మైదు హరిబాబు, కె.గంగబాబు మాట్లాడారు. వైసిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు కాదా గోవింద్‌కుమార్‌, రాయుడు గంగాధర్‌, నాయకులు కొపనాతి నాగరాజు, బూరెల వెంకటరాజు, దున్న శ్రీకాంత్‌, భూసారపు పద్మారావు, స్థానిక ఎంపీటీసీ కడియాల మహాలక్ష్మి, శ్రీను, టిల్ల పూడి నాగేశ్వరరావు, కామాడి మాతరాజు, పేర్ని ఆదినారాయణమూర్తి, పినపోతు కామేశ్వరరావు, వార సూర్యకుమారి, కొప్పిశెట్టి వెంకట్‌, అంకాడి అంజిబాబు, గంపల నాగేశ్వరరావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.