Apr 13,2023 18:05

వార్డులో పర్యటిస్తున్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, కమిషనర్‌

తాగునీటి సమస్య తలెత్తరాదు
- మునిసిపల్‌ చైర్మన్‌ షేక్‌ మాబున్ని సా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      నంద్యాల పట్టణంలోని ఆయా వార్డులలో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని మునిసిపల్‌ చైర్మన్‌ షేక్‌ మాబున్నీ సా సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక 27వ వార్డులోని దేవనగర్‌-2లో ఆమె మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రారెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించారు. స్థానిక, మంచినీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగు నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ డిఈ శ్రీనివాస రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ అంకి రెడ్డి, శానిటరీ సూపర్‌ వైజర్‌, వార్డు కౌన్సిలర్‌, వార్డు ఇంచార్జీ, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.