May 21,2023 00:41

మాట్లాడుతున్న ప్రత్యేక అదికారి

ప్రజాశక్తి -కోటవురట్ల:గ్రామీణ ప్రాంతాల్లో వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మండల ప్రత్యేక అధికారి అరుణశ్రీ సూచించారు. శనివారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా పారిశుధ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సిబ్బంది సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు అందజేయాలని సూచించారు. ఉపాధి కూలీలకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్‌ కరుణ, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్‌ జగదీశ్వరరావు, ఏపీవో గంగునాయుడు, తదితరులు పాల్గొన్నారు.