Aug 25,2023 20:00

అధికారులకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణ ప్రజలకు భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ.నూర్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. రాంజల చెరువులో చేపలు వేటాడకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు గట్టుపై సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. చెరువు లోపల గోడపై జిగ్‌జాగ్‌ రాళ్లను అమర్చాలని, వ్యర్థాలు పారవేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.