Jun 24,2023 20:26

రెండు బోర్లు చెడిపోవడంతో మరమ్మతులు చేయిస్తున్న సర్పంచి

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకునే బాధ్యత తనపై ఉందని సర్పంచి దాసరి గోవిందరాజులు తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిప్పగిరిలో రెండు, మూడు రోజుల్లోనే తాగునీటి కొరత లేకుండా అందిస్తున్న రెండు బోరు మోటార్లు కాలిపోయాయని తెలిపారు. వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన సలహా మేరకు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ నారాయణ సహకారంతో వెంటనే బోరు మెకానిక్‌ను తీసుకొచ్చి కాలిపోయిన మోటార్ల స్థానంలో కొత్త ఎసి మోటార్లను వేయించి తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూసుకున్నామన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే స్పందించి కొత్త బోరు మోటార్లను అమర్చి సమస్యను పరిష్కరించినందకు ప్రజలంతా సర్పంచి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి బాలన్న పాల్గొన్నారు.