Sep 24,2023 22:02

ప్రజాశక్తి - పోలవరం
   మండలంలోని గ్రామ పంచాయతీలోని గణేష్‌ నగర్‌ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నీటి కొరత ఉండడంతో అక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా వారి సమస్యలు విని వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సర్పంచి పొడుం పుష్పకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పంచాయతీ సిబ్బంది చేత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాదాపు 50 కుటుంబాల నీటి కొరత సమస్యను తీర్చారు. సమస్యను త్వరగా పరిష్కరించినందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసి ఎంఎల్‌ఎ బాలరాజు, సర్పంచి పొడుం పుష్పకు కృతజ్ఞతలు తెలిపారు.