Aug 30,2023 21:12

ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణ వాసులకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని, ఎవరూ అధైర్య పడవద్దని మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత, వైసిపి ఇన్‌ఛార్జీ జయ మనోజ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని 34వ వార్డులో రెండో రోజూ ఛైర్మన్‌ బోయ శాంత ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. జయమనోజ్‌ రెడ్డి ఇంటింటికీ వెళ్లి వార్డుల సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంతి జగన్మోహన్‌ రెడ్డి పేదలకు 'అమ్మఒడి' అందిస్తూనే నాడు-నేడు కింద పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. వచ్చే 2024 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా, సాయిప్రసాద్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైసిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి.దేవా, రాష్ట్ర డైరెక్టర్‌ రేణుక, జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ నియాజ్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు రఘునాథ్‌ రెడ్డి, చలపతి, బాలాజీ, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, అసిస్టెంట్‌ ఇంజినీర్లు కృపాకర్‌, రాజశేఖర్‌ రెడ్డి, మెప్మా ఆఫీసర్‌ వీరారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ నరసింహులు, డీలర్‌ నాగరాజు, సన్నీ, మధుసూదన్‌ శర్మ, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ బాష, శ్రీలక్ష్మి, జులేఖాబీ, చిన్న ఈరన్న, రహీం, గంగాధర్‌, కోదండ, శంకర్‌, శోభలత, శీనా, వార్డు కౌన్సిలర్‌ అంజినమ్మ, వార్డు ఇన్‌ఛార్జీ కె.భాస్కర్‌, సూరి, రామలింగేశ్వర్‌ యాదవ్‌, మధు, ఏసు, పరిగెల నారాయణ ఉన్నారు.