Nov 15,2022 00:13

తాగునీటి పైప్‌లైను పనులు పరిశీలిస్తున్న కార్పొరేటర్‌ పిళ్ళా మంగమ్మ

ప్రజాశక్తి- మధురవాడ : ఏడవ వార్డు పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కృషి చేస్తానని ఆ వార్డు కార్పొరేటర్‌ పిళ్ళా మంగమ్మ చెప్పారు. సోమవారం మంగమ్మ ఆమె భర్త టిడిపి నాయకుడు పిళ్ళా వెంకటరావుతో కలిసి మొగధారమ్మ కాలనీలో జరుగుతున్న తాగునీటి పైప్‌లైను పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలనీ నిర్మాణం నుంనీ తాగునీరు తదితర సమస్యలుపై ప్రజల ఇబ్బందులను కౌన్సిల్‌లో పెట్టి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. మిగిలిన సమస్యలు కూడా తొందర్లోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. కాలనీవాసులు పలువురు కార్పొరేటర్‌కు అభినందనలు తెలిపారు.