Nov 18,2023 19:42

జెండాను ఆవిష్కరిస్తున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
తాగునీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని వైసిపి రాష్ట్ర యువనేత వై.ప్రదీప్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని సూగూరు గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందడంతో లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నప్పటికీ తాగునీటి సమస్య ఉన్నట్లు చెబుతున్నారని తెలిపారు. పక్కనే ఎస్‌ఎస్‌ ట్యాంకు ఉన్నా ఈ దుస్థితి ఏమిటని ప్రశ్నించారు. పైపులైన్ల విస్తరణలో సమస్యలు వస్తున్నాయని తెలపడంతో పరిష్కారం చూపాలని కోరారు. రోడ్డు సమస్య కూడా ఉందని, రానున్న రోజుల్లో వేయిస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వాలంటీరు వ్యవస్థ బాగా పని చేసిందని ప్రశంసించారు. 'గడపగడపకు' వచ్చిన రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఎన్నికల్లో గ్రామం నుంచి ఎప్పుడూ మెజారిటీ వస్తుందని, దానిని మరచిపోమని, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల బుక్‌ లెట్‌ ను అందజేశారు. అనంతరం వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఆయనకు వైసిపి నాయకులు శాలువా, గజమాలతో సన్మానించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, సర్పంచి శంకరమ్మ, ఎంపిటిసి హనుమంతు, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపిడిఒ మణిమంజరి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ వేదస్వరూప, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు, ఎపిఒ తిమ్మారెడ్డి, పిఆర్‌ ఎఇ నరసింహులు, ఎఒ గణేష్‌, నాయకులు లక్ష్మయ్య, లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.
వలస వెళ్లి ఇబ్బందులు పడొద్దు : ఎంపిడిఒ
ఉపాధి హామీ చట్టం కింద గ్రామాల్లోనే ఉపాధి పనులు జరుగుతున్నాయని, వలస వెళ్లి ఇబ్బందులు పడొద్దని ఎంపిడిఒ మణిమంజరి కోరారు. అమ్మాయిలకు బాల్య వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని తెలిపారు.