పనులను పరిశీలిస్తున్న ఎస్‌ఇ గణపతిరావు
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : నగరపాలక సంస్థ పరిధిలోని బిసి కాలనీ, కెఎల్‌పురం, ధర్మపురిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న రిజర్వాయర్ల పనులు ప్రజారోగ్య సాంకేతిక శాఖ పర్యవేక్షక ఇంజినీర్ పి.గణపతిరావు పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనుల టెండర్లు త్వరితగతిన పిలిచి పనులు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ ఇంజనీర్ కె.శ్రీనివాస రావు, ఇఇ కె.దక్షిణమూర్తి, టెక్నికల్ ఆఫీసర్ కె.ఫణికుమార్, డిఇఇలు వి.జగన్ మోహన్, ఎస్.అప్పారావు, సిహెచ్ చంద్రమౌళి పాల్గొన్నారు.










