ప్రజాశక్తి ఎటపాక
మండలంలోని కృష్ణవరం పంచాయతీ జిన్నగట్ట గిరిజన గ్రామంలో మరమ్మత్తు గురైన సోలార్ వాటర్ సిస్టమ్‌ను బాగు చేసి నీటి ఎద్దడిని తీర్చాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ నాయకులు సోలార్ వాటర్ సిస్టమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మే నెలలో వచ్చిన గాలివానకు సోలార్ ప్లేట్ కింద పడి విరిగి పోయిందని, ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా మరమ్మతులు చేయలేదని పేర్కొన్నారు. దీంతో అక్కడున్న 40 కుటుంబాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేసి నీటి ఎద్దడి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణవరం ఎంపిటిసి కంటే రాజు, మాజీ సర్పంచ్ పద్దం సత్తెమ్మ, గన్నవరం ఉపసర్పంచ్ కందుకూరి స్వర్ణ, గిరిజన సమాఖ్య మండల ఉపాధ్యక్షుడు సున్నం శ్రీను, రైతు సంఘం నాయకులు పూసా రాఘవులు, ముసునూరి వెంకన్న బాబు, ప్రసాద్, సత్యనారాయణ, సత్యం, వీరయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.










