Oct 07,2022 23:52

పైపు అపహరణకు గురైన దృశ్యం

ప్రజాశక్తి- చింతూరు
మండల కేంద్రంలోని చింతూరు శబరి నది వారధిపై తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన పైపులైనును దుండగులు అపహరించారు. ఈ పైపు లైన్‌ను ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తులు కట్‌ చేశారని, దీనిని అపహించేందుకే కట్‌ చేసి ఉంటారని హెచ్చరిస్తూ ఈ నెల 5న ప్రజాశక్తి వార్తను ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం ఉదయానికల్లా తాగునీటి పైపు మాయమైంది. మరికొన్ని చోట్ల పైపులు కట్‌ చేసి తస్కరించేందుకు సిద్ధంగా ఉంచడం జరిగింది. ఈ విషయంపై పంచాయతీ అధికారికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో సిబ్బందిని పంపించి కట్‌ చేసిన పైపులను కార్యాలయాన్ని తరలిస్తామని చెప్పారు.