కుళాయిలను ప్రారంభిస్తున్న సర్పంచ్ పూనెం సరోజిని
ప్రజాశక్తి-విఆర్.పురం
మండలంలోని రేఖపల్లి పంచాయతీ పరిధి పెట్ట బచ్చయ్యవీధిలో తాగునీటి కుళాయిలను ఆ గ్రామ సర్పంచ్ పూనెం సరోజిని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్ట బుచ్చయ్య వీధి నుండి సంతపాకల చెరువు వరకు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామంలో వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, పంచాయతీ సెక్రెటరీ శివ ప్రసాద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కుంజా తరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.










