Dec 09,2022 23:37

తాగునీటి కుళాయి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపిపి కారం లక్ష్మి

ప్రజాశక్తి-విఆర్‌.పురం : మండలంలోని రామవరం పంచాయతీలో తాగునీటి కుళాయిల ఏర్పాటు పనులకు ఎంపిపి కారం లక్ష్మి, సర్పంచ్‌ కారం బుచ్చమ్మ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామంలో నూతనంగా మంజూరైన పైప్‌ లైన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కారం లక్ష్మి మాట్లాడుతూ వేసవి కాలం సమీపిస్తున్న దృశ్య తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతి ఇంటికీ కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సర్పంచ్‌ బుచ్చమ్మ మాట్లాడుతూ పైపులైన్‌ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు వడ్లది రమేష్‌, కారం సుందరయ్య, అధికారులు పాల్గొన్నారు.