Aug 17,2023 20:02

ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

ప్రజాశక్తి - కోసిగి
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో దుద్ది చెరువు దగ్గర ఉన్న నీటి బోర్లకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినట్లు కోసిగి మేజర్‌ పంచాయతీ సర్పంచి ఎస్‌.అయ్యమ్మ తెలిపారు. గురువారం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి నీటి బోర్లకు కనెక్షన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతంలో లోవోల్టేజీ సమస్య వల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడేదని తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. గ్రామంలో నీటి సరఫరాను పూర్తిస్థాయిలో అందిస్తామని తెలిపారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్‌ రెడ్డి సహాయ, సహకారాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నడపడానికి కృషి చేస్తామని చెప్పారు. వైసిపి యువ నాయకులు రాజేష్‌, పంచాయతీ సిబ్బంది హుస్సేని, నరసప్ప, రామకృష్ణ, మధు, బాష, గోవిందు, చిన్న నరసింహులు, రాము పాల్గొన్నారు.