Aug 23,2023 22:04

ఖాళీబిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు

మడకశిర : పట్టణ సమీపంలోని చౌటుపల్లి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీవాసులు బుధవారం రోడ్డుపై బైటాయించారు. ఈసందర్భంగా పెనుకొండ మడకశిర ప్రధాన రహదారిలో కాలనీవాసులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్నా సంబంధిత అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరారు.