Feb 03,2023 00:01

వినతిపత్రం ఇస్తున్న సిపిఎం ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి, కూనవరం
మండలంలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాలని సీపీఎంకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, ప్రజలకు మంచినీటి సక్రమంగా అందించుటకు పంచాయితీల్లో నిధులు లేక ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని పేర్కొన్నారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించడానికి ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రేగులపాడు సర్పంచ్‌ బొగ్గా రామారావు, కుటూరు సర్పంచ్‌ బొగ్గా వెంకమ్మ, పెద్ద అర్కూర్‌ ఎంపీటీసీ ధర్ముల అమ్మాజీ, చూసిరేవుల గూడెం ఎంపీటీసీ కారం జయసుధ, మాజీ ఎంపీటీసీ మేకల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ పాయం సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.