Jan 11,2023 22:48

ప్రజాశక్తి-కంచికచర్ల

నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పెద్ద బజారు, సత్రం బడి రోడ్డు, మసీదు సెంటర్‌ లో ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. మసీదు సెంటర్‌ నుండి జాతీయ రహదారి పక్కన గల వ్యాపారస్థులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు, తాగునీరు సమస్య, డ్రైనేజీ సమస్యలను ప్రస్తావించారు. తాగునీరు సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్‌ ను ఆదేశించారు. సర్పంచ్‌ వేల్పుల సునీత, ఉప సర్పంచ్‌ వేమా సురేష్‌ బాబు, వైసిపి నాయకులు వేల్పల శ్రీనివాసరావు, వంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.