శంకుస్థాపన చేస్తున్న ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి-అనంతగిరి:మండల పరిషత్ కార్యాలయానికి రన్నింగ్ వాటర్ సరఫరా చేయలన లక్ష్యంతో అరకు పార్లమెంట్ ఎంపీ నిధులతో సోమవారం స్థానిక ఎంపీపీ శెట్టి. నీలవేణి, జెడ్పిటిసి దీసరి గంగరాజు, స్థానిక సర్పంచ్ సోమ్మేల రూతు బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, కొత్త భవనం పూర్తయినప్పటికీ రన్నింగ్ వాటర్ లేక పోవడంతో కార్యలయ సిబ్బంది. ఇతర ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. బోరు నిర్మాణంతో నీటి సరఫరా అందుబాటులో వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ .మదిన, ఇన్స్‌చార్జి ఎంపీడీవో వివి. కుమార్, సీనియర్ అసిస్టెంట్ రామచంద్రరావు, సర్పంచులు కొర్రా. సింహాద్రి, . సీతయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నాగులు పాల్గొన్నారు.










