Oct 09,2023 23:30

బోర్లు తవ్వకాలకు భూమి పూజ చేస్తున్న కార్పొరేటర్‌ హేమలత

ప్రజాశక్తి -మధురవాడ: జివిఎంసి 5వ వార్డు పరిధిలో తాగునీటి బోర్లు ఏర్పాటుకు సోమవారం కార్పొరేటర్‌ మొల్లి హేమలత భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, గత కౌన్సిల్‌ సమావేశాలలో వార్డులో తాగునీటి ఇబ్బందులు గురించి ప్రస్తావించగా చేతి పంపు బోర్లు మంజూరయ్యాయని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాలనీ, స్వాతంత్ర నగర్‌, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎమ్‌ పిపి 2 కాలనీలలో చేతిపంపు బోర్లు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. ఇంకా వార్డులో చాలా చోట్ల తాగునీటి పైపు లైన్లు, చేతి పంపు బోర్లు అవసరం ఉందని, వాటి గురించి కూడా మేయర్‌, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లానని, తొందరలోనే మంజూరవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వియ్యపు నాయుడు, ఓలేటి శ్రావణ్‌, నూకరాజు, మాదాల విజరు, మోహన్‌, మహమ్మద్‌ అలీ, మురళి, కోళ్ల వెంకటేష్‌, పిళ్ళా అప్పన్న, కందుల సత్యనారాయణ, పెంటరావు, చందు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.