ప్రజాశక్తి - జంగారెడ్డి గూడెం
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మండలంలోని తాడువాయి గ్రామంలో టిడిపి నిరసన దీక్ష చేపట్టారు. బుధవారం మండల టిడిపి ఆధ్వర్యంలో తాడువాయిలో 8వ రోజు రిలే నిరాహారదీక్షలలో భాగంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి భారీగా మహిళలతో నిరసన దీక్ష నిర్వహించారు. ముందుగా టిడిపి మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మహిళలకు పూల మాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల నుంచి 500 మంది మహిళలు ఈ రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంఎల్‌ఎ ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తరెడ్డి, జనసేన కన్వీనర్ మేక ఈశ్వరయ్యలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల శ్రీను, మండల మాజీ ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, మండల మహిళా కమ్మిటీ అధ్యక్షురాలు దండే పద్మ, పట్టణ అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల, ప్రగఢం సౌభాగ్యవతి, నల్లంట్ల కాంతారావు పాల్గొన్నారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జంగారెడ్డిగూడెం కోర్ట్ నుంచి టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు వచ్చి సంఘీభావం తెలిపారు.










