Dec 21,2020 13:31

తాడేపల్లి (అమరావతి) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. సోమవారం సిఎస్‌ నీలం సాహ్ని, డిజిపి గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి లు జగన్‌ నివాసంలో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన, పెద్దిరెడ్డి, బాలినేని, ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌, వైవి సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు.
       తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో సిఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, వైసిపి నేతలు పరిశీలించారు.
      ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జననేత జగన్‌ పుట్టిన రోజును స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు పండుగలా చేసుకుంటున్నారని అన్నారు. ఏడాదిన్నరలోనే చాలా మార్పులు చేపడుతూ ప్రజలకు సిఎం సంక్షేమం అందిస్తున్నారని ప్రశంసించారు. ఏ సమస్య లేకుండా రూ. 60 వేల కోట్ల నిధులు ప్రజల అకౌంట్‌కి చేరాయని తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో బ్లడ్‌ నిల్వలు తక్కువగా ఉన్నాయని, అందుకే తాము ఈ రక్తదానం కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. సిఎం జగన్‌ వందేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ.. ఆరోగ్యాంగా ఉండాలి' అని సజ్జల రామకృష్ణారెడ్డి కోరుకున్నారు.