Feb 03,2023 15:19

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్రకమిటి పిలుపులో భాగంగా సూళ్లూరుపేట డిపో వద్ద డిపోకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఓ.టి.డబ్బులు, అలెవెన్సులు, 2017 ఆర్పీయస్ ఆరియర్స్,లీవ్ ఎన్ క్యాష్ మెంట్,వెంటనే ఇవ్వాలని,1/2019 సర్కులర్ ను పరిగణలోకి తీసుకోవాలని డిపో అధ్యక్షుడు రమణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఉపాధ్యక్షుడు బి.రవి, డిపోకార్యదర్శి టి.సాల్మన్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట సి.ఐ.టి.యు నాయకులు బి.పద్మనాభయ్య, పి.మనోహరం, తిరుపతి జిల్లా సి.ఐ.టి.యు నాయకులు యస్.అల్లయ్య  పాల్గొని సంఘీభావం తెలియజేసారు.