ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, స్వామి వివేకానంద పాఠశాలలో, స్వామి వివేకానంద 161వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డి.సదాశివం వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువతరం స్వామి వివేకానందనీ స్ఫూర్తిగా తీసుకోవాలని భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడని కొనియాడారు. విద్యార్థులకు క్రమశిక్షణ చదువు ఉంటే ఉన్నత స్థాయి ఎదుగుతారని అన్నారు. దేశ విదేశాలలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు పేట బాలకృష్ణారెడ్డి, వివిధ విద్య సంస్థల ప్రిన్సిపాల్ లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










