ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : స్వచ్ఛ, సురక్ష సాగర్ కార్యక్రమం ద్వారా తీరప్రాంతాలు పరిశుభ్రత చెందుతాయని సర్పంచులు తెలిపారు. శనివారం
అమీనాబాద్ సముద్రం తీరం వద్ద అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఇన్ క్వయిస్ ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతం వద్ద ఉన్న చెత్తను సేకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా సర్పంచులు నక్కా మణికంఠ బాబు,ఉమ్మిడి మేరీ జాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్ర తీరాన్ని డంపింగ్ యార్డ్ గా వినియోగిస్తున్నారని ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు ఇతరులకు అవగాహన కల్పించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు అలాగే మత్స్యకారులకు చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాన్ని వ్యాప్ ద్వారా గుర్తించడం వల్ల మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అధికారులు వివరించారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇన్ క్వయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్ క్వయిస్ సభ్యులు సైంటిస్ట్ డాక్టర్ పి విజయ, ప్రాజెక్ట్ సైంటిస్ట్ సిహెచ్ శ్రావణి. మండల మత్స్యశాఖ అధికారి కె శ్రీరామకృష్ణ,,ఎంపీటీసీ మెరుగు ఎలజి, మత్స్యకార పెద్దలు తదితరులు పాల్గొన్నారు.










