- ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్...
ప్రజాశక్తి-విఆర్ పురం : మండలంలోని రామవరం పంచాయతీలో అడవి వెంకన్నగూడెం రామవరం గ్రామాలలో చేస్తున్న పునరవాస ఇండ్ల సర్వేను పరిశీలించిన ఎంపీపీ కారం లక్ష్మి సిపిఎం బృందం సర్వే చేస్తున్న అధికారులను సర్వే చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో సర్వే చేసే విధానం అసలు బాగాలేదని ఆ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లామని అయినా ఇప్పటికి కూడా అధికారుల తీరు మారలేదని దుయ్యబట్టారు. సర్వే చేసేటప్పుడు ఓపికతో ఇంటి యజమానిని దృష్టిలోకి తీసుకొని ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని నిర్వాసితుడికి పూర్తి న్యాయం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న తన సొంత గ్రామాన్ని వ్యవసాయాన్ని అన్నిటిని రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్న విషయాన్ని అధికారులు గమనించాలని నిర్వాసితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదని కోరారు. అంతేకాకుండా ఇంటి కొలతలు తీసుకునేటప్పుడు పొడవు వెడల్పులు మాత్రమే చూస్తున్నారు. ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలను ఇంటి ఆరుబయట చేసిన సిమెంట్ వాకిలిని కూడా చూడటం లేదనీ విమర్శించారు ఒకవేళ ఇంటి యజమానులు అభ్యంతరం పెట్టిన పట్టించుకునే ఓపిక కూడా సర్వేచేసే అధికారులకు లేదని వాపోయారు. సర్వే చేసేటప్పుడు గోడల నాణ్యతను కూడా చూడాలని అసలు వాటి మందం ఎంతలో ఉందో కూడా చూసి నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లకు కూడా సర్వే చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎక్కడ ఏ నిర్వాసితులు కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఇక్కడే ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని సర్వే చేయాలని పోలవరం ప్రాజెక్టు వల్ల తాము నష్టపోయినపర్వ లేదు అని రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవత్సరాలుగా ఉంటున్న గ్రామలను త్యాగం చేస్తున్న గిరిజన గ్రామాలకు ఎటువంటి అన్యాయం జరగకూడదని సిపిఎం బృందం డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం. సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు నాయకులు కుంజ నాగిరెడ్డి సుధీర్ తదితరులు పాల్గొన్నారు










