Mar 29,2023 14:19
  • సత్యవేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సునంద పద్మనాభం.

ప్రజాశక్తి-నాగలాపురం : తిరుపతి జిల్లా నాగలాపురం కేంద్రంగా నడుస్తున్న సత్యవేడు మార్కెట్ కమిటీ ద్వారా ఈ ప్రాంత రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తామని సంబంధిత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సునంద పద్మనాభం చెప్పారు. విలేకరులతో ఆమె  మాట్లాడారు.రైతులు రేయంపగళ్ళు చెమటోడ్చి పండించిన పంటలను గిట్టుబాటు ధర వచ్చేంతవరకు మార్కెట్ కమిటీ గోడౌన్లో నిల్వ చేసుకోవచ్చునన్నారు. వరి,వేరుశనగ,సజ్జలు,సన్ఫ్లవర్ వంటి పంట దిగుబడులను 90 రోజుల వరకు ఉచితంగ నిల్వ చేసుకోవడానికి చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించానవసరం లేదన్నారు. మూడు నెలలు దాటిన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రైతులు నిల్వ చేసుకున్న పంటలకు సంబంధించి తక్కువ రుసుము చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నా గూడౌన్ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మార్కెట్ కమిటీ పరిధిలో పిచ్చాటూరు,నాగలాపురం మండలం సురుటుపల్లి,సత్యవేడు,నారాయణవనంలో తనిఖీ కేంద్రాలు నడుస్తుందన్నారు. వీటి ద్వారా వ్యవసాయ సంబంధిత సరుకులు తరలింపులో బిల్లులను పరిశీలించి చెస్ వసూలు చేస్తాయని ఆమె గుర్తు చేశారు.ఇందులో భాగంగానే వేరుశనగ,సజ్జలు,సన్ఫ్లవర్,యూకోలెప్టోస్ వంటి వాటికి ఒక శాతం,వరికి రెండు శాతం పన్ను విధించడం జరుగుతుందన్నారు. తమ మార్కెట్ కమిటీ 2022-2023 నాటికి నిర్దేశించిన టార్గెట్ 58 లక్షల రూపాయలు మించిపోయింది అన్నారు. అయితే మార్కెట్ కమిటీ కార్యాలయంలో 14 మంది రెగ్యులర్ పోస్టులు గాను ఇద్దరు మాత్రమే ప్రస్తుతం ఉన్నారన్నారు. ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీకి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటు కేంద్రాల్లో తనిఖీ కేంద్రాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 13 మంది సెక్యూరిటీ గార్డ్లు పనిచేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఏది ఏమైనా వ్యవసాయ మార్కెట్ కమిటీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ప్రాంత రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సేవలను మరింత విస్తృతం చేయడంపై దృష్టి సారిస్తామన్నారు.