- సర్పంచ్ పూనేం సరోజినీ
ప్రజాశక్తి-విఅర్ పురం : మండలములోని రేఖపల్లి పంచాయితీ గొల్లగూడెంలో గ్రామంలో రాత్రి జరిగిన అగ్నప్రమాదంలో గొల్ల గ్రామానికీ చెందినా పినబోయిన సాయిబాబాకు చెందిన ఇల్లు అగ్నికి అవుతయింది కాగా శనివారం బాదిత కుటుంబాన్ని మండల కేంద్రం రేఖపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పునేం సరోజిని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం.సత్యనారాయణ సీనియర్ నాయకులు పంకు శ్రీరామ్మూర్తి పలువురు నాయకులు బాదిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పక్కా ఇల్లు మంజూరు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిత్యవసర సరుకులు అందించాలని ఆయన ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంకు శ్రీరామమూర్తి వార్డు మెంబెర్ కృష్ణ వేణి సోలా ఏసు బాబు తది తరులు పాల్గొన్నారు.










