ప్రజాశక్తి-పెడబయలు : మండలంలో సీకారీ పంచాయతికి చెందిన వెలపలేం గ్రామస్తుడు మరియు మంచంగి గనేశ్వర్ రావు48 మతి స్థిమితం కోల్పోయి ఆదివారం తెల్లారుజాము నాలుగు గంటల సమయంలో పన్నేడ గ్రామం మిల్లు సమిపలో గల గిరిగంగా నూతిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నట్లు స్థానిక ఎస్ ఐ పులి మనోజ్ కుమార్ తెలిపారు. గత కొంత కాలంగా మతిస్థిమితం లేక ఇబ్బందీ పడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపి నట్లు అదేవిధంగా మృతుడు శనివారం రాత్రి శీకరీ పంచాయతీ వెలపలెంలో సర్పంచ్ గుల్లెల కృష్ణారావు ఇంట్లో నిద్రించి గుట్టుచప్పుడు కాకుండా ఒంటరిగా నడచి వెళ్లి గిరిగాంగ నూతి బావిలో శవమై కనిపించాడు. మృతదేహ పంచనామా అనంతరము ఆయన కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు, మృతునికి భార్య, నలుగురు మగ పిల్లలు ఉన్నట్లు తెలిసింది. కేసునమోదు చేస్తున్నట్లు స్థానిక ఎస్ ఐ పి మనొజ్ కుమార్ తెలిపారు










