ప్రజాశక్తి-తిరుపతి : జగనన్న కాలనీలో తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను రద్దు చేశారని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాగలాపురం మండలం రెవెన్యూ కార్యాలయంలో అధికారుల తీరుపై రేణు బాబు అను వ్యక్తి మనస్తాపం చెందారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను వీఆర్ఓ చంద్రశేఖర్ రద్దు చేశారంటూ మనస్థాపం చెందిన రేణుబాబు తాసిల్దార్ ప్రసన్న కుమార్ ముందే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రేణు బాబును ఆసుపత్రికి తరలించారు. రేణు బాబు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.










