May 06,2023 16:27

ప్రజాశక్తి-పాకాల : పాకాల అంబేద్కర్ భవన నిర్మాణానికి కృషి చేసి దళిత బహుజనుల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న ఘనత ఎద్దుల సుబ్రహ్మణ్యం గారిదని అంబేద్కర్ భవన అధ్యక్షుడు ఆనందయ్య అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో అధ్యక్షులు ఆనందయ్య ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ భవన్ వ్యవస్థాపకులు మరియు మాజీ అధ్యక్షుల రెండవ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సుబ్రహ్మణ్యం గారు ఈ భవన నిర్మాణమునకు అభివృద్ధికి నిరంతరం తనదిగా కృషి చేసి ఈరోజు మనకు అందించడం మనమందరము పడాల్సిన విషయమని అన్నారు. అలాంటి ఆదర్శమూర్తి మన మధ్యలో ఇప్పుడు లేడు అయన ఆలోచనతో మనం ముందుకెళ్లాలని అన్నారు. దళిత ఉద్యమ నేతగా జిల్లాలోని పేద ప్రజల కోసం వారి సమస్యల కోసం ఆత్మగౌరవంతో జీవించాలని తనవంతు కృషి చేశారని అన్నారు.బహుజన నేతగా అనేకమందిచే మన్ననలు పొందాడు,అలాంటి వారుని మనం గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో భవనం సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం కాదు, ఇలాంటి వ్యక్తులు మనకు ఆదర్శం  అలాంటి వారి దారిలో మనం నడిచినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి అర్పించిన వాళ్ళమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రభు మరియు భువన సభ్యులు పాల్గొన్నారు.