చదువంటే ... ఓ ఆయుధం
చదువుకుంటే ... ఆనందం
చదవకుంటే... అగాధం !
చదువంటే ... ఓ విజ్ఞానం
చదువుకుంటే ... జ్ఞానం
చదవకుంటే ... అజ్ఞానం !
చదువంటే ... ఓ కీర్తి
చదువుకుంటే ... స్ఫూర్తి
చదవకుంటే ... ఆర్తి!
చదువంటే ... ఓ సంస్కారం
చదువుకుంటే ...నమస్కారం
చదవకుంటే ... నిస్సారం !
చదువంటే ... ఓ దీపం
చదువుకుంటే ... రూపం
చదవకుంటే ... శాపం !
చదువంటే ... ఓ అనంతం
చదువుకుంటే ... ఉన్నతం
చదవకుంటే ... అంతం!
చదువంటే ... ఓ నిధి
చదువుకుంటే ... బుద్ధి
చదవకుంటే ... బూడిది!
చదువంటే ... ఓ జగతి
చదువుకుంటే ... సరస్వతి
చదవకుంటే ... దుర్గతి!
చదువంటే ... ఓ గురువు
చదువుకుంటే ... తరువు
చదవకుంటే ... కరువు!
దొంగిలించనిది చదువొక్కటే
తరిగిపోనిది చదువొక్కటే
అంతం లేనిది చదువొక్కటే !
- బి పాండురంగ










