Oct 06,2023 12:09

ప్రజాశక్తి-తిరుపతి :  నాగలాపురం మండలం బీరకుప్పంలో  రోడ్డు మరమ్మత్తు చేయాలని రోడ్డుపై బైఠాయించి యువకులు ధర్నా చేశారు. నాగలాపురం - టీపీ కోట రోడ్డు  విస్తరణ కోసం మూడేళ్ల క్రితం నిధులను  ప్రభుత్వం విడుదల చేసింది. అయినా ఇప్పటికి పనులు ప్రారంభం కాలేదు. 20 కిలోమీటర్ల మేర రోడంత గుంతలు పడి ఉంది. అసహనంతో యువత  రోడ్డెక్కిన్నారు. వీరితో పాటు ఆ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం రోడ్డెక్కి ధర్నాలో పాల్గొనడం విశేషం.