- మద్దతు పలికిన కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప
ప్రజాశక్తి-అనంతపురం : ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ కే యు ప్రధాన గేటు ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారానికి 5వ రోజుకు చేరుకుంది. వీరికి మద్దతుగా కుల వివక్ష పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు. విద్యార్థి సంఘాలు చేపట్టి న్యాయమైన సమస్యను వరుసటి అధికారులు పరిష్కరించాలని ఆయన కోరారు. 5వ రోజు కూర్చున్న వారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.కుల్లాయస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, వర్సిటీ అకాడమీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రతాప్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మంజునాథ్, ఏఐఎస్ఎ యూనివర్సిటీ కార్యదర్శి రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలుపుతూ కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, మాజీ విద్యార్థి నాయకులు రామిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకులు డాక్టర్ అంకన్న, ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు వేమన, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉమామహేష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.










