ప్రజాశక్తి-తిరుమల : తిరుపతి నగరంలోనే కాకుండా తిరుమల కొండపై కూడా గంజాయి మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో ఈ గంజాయి విక్రయాలకు పాల్పడి యువత భవిష్యత్తులను నాశనం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు గారికి జనసేన పార్టీ తరపున సోమవారం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు బాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, మునుస్వామి, రాజేష్ ఆచారి, కిరణ్ కుమార్, సుజిత్ లకు హామీ ఇవ్వడం జరిగింది.










