May 06,2023 16:13

ప్రజాశక్తి-అడ్డతీగల : స్థానిక మండల కేంద్రంలో జరిగిన 2022-23 విద్యా సంవత్సరం గాను 367 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా 218 మంది ఉత్తీర్ణతను సాధించారని, 149 మంది ఫెయిలయ్యారని 59%  ఉత్తీర్ణత శాతం వచ్చిందని ఎంఈఓ మల్లేశ్వరరావు తెలిపారు. మండల టాపర్ గా వెదురు నగరం G.V.K. స్కూల్ చెందిన జర్తా మౌనిక 550 మార్కులతో ప్రథమ స్థానం వచ్చిందని, ఏపీఆర్ గురుకులం స్కూల్ కి చెందిన జగు రాజుకుమార్ 549 మార్కులతో ద్వితీయ స్థానం వచ్చిందని ఆ విద్యార్థులు ఇద్దరిని ఎంఈఓ మల్లేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వెదురు నగరం స్కూల్లో 20 మంది పరీక్షకు హాజరుకాగా 20 మంది పాసయ్యారని 100% వచ్చిందని ఆయన వివరించారు, గురుకులం పాఠశాలలో 75 మందికి 55 మంది పాసయ్యారని, జడ్పీ హైస్కూల్ రాయపల్లి ఆరుగురు హాజరుకాగా ముగ్గురు పాసయ్యారని, జడ్పీ హైస్కూల్ ఎల్లవరం 23 మంది హాజరు కాగా 16 మంది మాత్రం పాస్ అయ్యారని, ఆశ్రమ పాఠశాల అడ్డతీగల 24 మంది హాజరు కాగా 16 మంది పాసయ్యారని, ఆశ్రమ పాఠశాల వీరవరం 11 మంది హాజరు కాగా ఐదుగురు మాత్రం పాస్ అయ్యారని, ఆశ్రమ పాఠశాల డి. భీమవరంలో 39 మంది హాజరు కాగా 26 మంది పాస్ అయ్యారని, జడ్పీ హైస్కూల్ అడ్డతీగల 64 మంది హాజరు కాగా 35 మంది పాస్ అయ్యారని, జడ్పీ హైస్కూల్ గొంటువానిపాలెం 39 మంది హాజరు కాగా 20 మంది పాసయ్యారని, ఆశ్రమ పాఠశాల బాలికలు అడ్డతీగల 66 మంది హాజరు కాగా 25 మంది పాసయ్యారని ఎంఈఓ మల్లేశ్వరరావు వివరించారు.