Jul 25,2021 15:29

శ్రీశైలం : ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 3,70,817 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ ఫ్లో 25,427 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 855.60 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 93.5810 టిఎంసిలుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 24,082 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో అధికారులు 4,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. ప్రాజెక్ట్‌ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 536 అడుగుల మేర నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరిలో నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో 4 లక్షల 62 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.