Aug 07,2021 07:14

ప్రజాశక్తి-శ్రీశైలం ప్రాజెక్ట్‌ : శ్రీశైలానికి వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,35,780 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 27,399, సుంకేసుల నుంచి 43,790 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 2,06,969 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతున్నాయి. ఎపి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 31,035 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 33,549 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 884.40 అడుగులకు చేరింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 211.957 టిఎంసిలుగా నమోదైంది.