Jul 29,2021 12:57

శ్రీశైలం : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. దీంతో 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. 2,76,160 క్యూసెక్కుల వరద ప్రవాహం సాగర్‌ దిశగా సాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,62,390 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు వైపుల ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరో 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కారణంగా నిన్న సాయంత్రం కొన్ని గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 884.. ప్రస్తుత నీటి నిల్వ 210.0320 టీఎంసీలుగా ఉంది.