Sep 22,2023 14:04

ప్రజాశక్తి-ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ (ఎఫ్ ఏ సి)కమిషనర్ గా ప్రస్తుత మేనేజర్ కే శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కమిషనర్ కేఏ కొండలరావు ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతినిధులు సహకారంతో నగర పంచాయతీ సర్వతోభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక డ్రైవులు నిర్వహిస్తామని, సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయపరిచి సమస్యను మూడు భాగాలుగా విభజించి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈయన నియామకం పట్ల చైర్ పర్సన్ అలమండ సత్యవతి, వైస్ చైర్ పర్సన్ లు శిడగం త్రివేణి, మసిరపు బుజ్జి, వైకాపా జిల్లా కార్యదర్శి అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు అభినందించారు.