Apr 17,2023 14:32

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక స్వామి వీధి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు ఒలంపియాడ్ పరీక్ష లో ఘన విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీ రామకృష్ణ  తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, స్మార్ట్ వాచ్, హెడ్సెట్, గోల్డ్ మెడల్స్ సమర్పించారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రవికిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, బహుమతులు పొందడం చాలా గొప్ప విషయం అన్నారు. అనంతరం పాఠశాల ఏజీఎం డాక్టర్ శ్రీనివాసులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర కోఆర్డినేటర్ బాలాజీ  విద్యార్థులను కొనియాడారు. ప్రిన్సిపల్ శరవణ  మేము ఎప్పుడు విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తామని చెప్పారు, జోనల్ డీన్ తిరుగారు. ఈ కార్యక్రమంలో తదితర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.