ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : యువత కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో తెచ్చి, ఉపాధి, ఉద్యోగాలు కల్పించి వారికి మంచి భవిష్యత్తు అందించేందుకే యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తు ను నిర్వీర్వం చేసి, అంధకారం చేసిన వైసీపీ పాలన చరమగీతం పాడడానికి యువత ఐక్యంగా కదలిరావాలి. కుప్పంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 3వ రోజు కలిసి నడిచారు.యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు హామీ ఇచ్చిన టిడిపి అధికారంలోకి వచ్చాక యువతకు ప్రత్యేక మ్యానిఫెస్టోతో పాటు, ఉపాధి, ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏటా డిఎస్ సి, ప్రభత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ, పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేసారు. వీరి వెంట చిత్తూరు పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్చలు షణ్ముగ రెడ్డి, తెలుగు యువత సభ్యులు ఉదయ్, నవీన్ , కబిల్, చైతన్య, వాసు, ముత్తు,శేఖర్ లు పాల్గొన్నారు..










