
పల్లెలలో ప్రతి ఇల్లు
పలకరించే పిచ్చుక గూళ్ళు
వాసాలు వాటి నిజ నివాసాలు
ఇంటిల్లిపాది నేస్తాలు పిచ్చుకలు
ఊర పిచ్చుకల కిచకిచలు
కొక్కొరోకో కోడి కూతలు
ఉషోదయ బంగారు కిరణాలు
ఊరు వాడల మేలుకొలుపులు
రైతు ఇంట ధాన్యపు కంకులు
ఊర పిచ్చుకలకు విందులు
వాకిళ్ల ధాన్యపు ఆరబోతలు
చీడపురుగుల ఏరివేతలు
చిన్ని పాపలున్న ఇల్లు
పిచ్చుకలు చేయు సందళ్లు
పిచ్చుకల స్నానాల చిరుజల్లు
చూసిన మనసు పరవళ్ళు
- పి.బక్కారెడ్డి,
97053 15250.