Oct 12,2023 13:33

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: పెనుమూరులో ఇటివళ ఓ మైనర్ బాలిక మృతిపై పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గురువారం స్థానిక పోలీస్ అతిధి గృహంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటివరకు మాకు అందిన ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్యగానే తెలుస్తుంది. తల్లిదండ్రుల సమాచారం మేరకు వారు చెప్పిన నలుగురి అనుమానితులపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.