Oct 14,2023 11:19
  • విద్యుత్ శాఖ డీఈగా యుగంధర్

ప్రజాశక్తి - బి.కొత్తకోట : మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులు, సిబ్బందిని విద్యుత్ శాఖ నూతన డిఈ యుగంధర్ ఆదేశించారు. ఆయన ఇటీవల నూతన డీఈగా బాధ్యతలు స్వీకరించిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో బి.కొత్తకోట విద్యుత్ శాఖ కార్యాలయం నందు సెక్షన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు తగు సూచనలు,సలహాలిచ్చారు. అలాగే జిఎస్ సర్వేని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అలాగే రైతులు, ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.అనంతరం డీఈని అధికారులు, సిబ్బంది పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ రుక్మనంద బాబు, ఏఈ గిరి, ఎల్.ఐ యర్రంరెడ్డి, రెడ్డెప్ప మరియు సిబ్బంది పాల్గొన్నారు.