Sep 22,2023 15:40

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అని ,ప్రజలు చీడ పీడ పురుగులు నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పే జిల్లా అధికార యంత్రాంగం ప్రధాన కార్యాలయం జిల్లా కలెక్టరేట్ పాములకు నిలయంగా మారింది. గత కొద్ది నెలలుగా క్రితమే కలెక్టరేట్ లోని విద్యా శాఖ కార్యలయం సమీపంలో పాము కలకలం రేపిన విషయం తెలిసిందే. అది మరువక ముందే శుక్రవారం మరలా అదే జిల్లా విద్యా శాఖ కార్యాలయం సమీపంలో మరలా పాము కలకలం రేపింది.ఇటీవల పడిన ,పడుతున్న వర్షాలు కారణంగా విద్యా శాఖ కార్యాలయం చుట్టూ,ఎదురుగా విపరీతంగా దొంకలు,తిప్పలూ,మొక్కలు ఉండటంతో పాములు బయట పడుతున్నాయి. దీంతో విద్యా శాఖ కార్యాలయం ఉద్యోగులు, పక్కనే ఉన్న సర్వే శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పాము కలకలం రేపడంతో ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగులు కుర్చీలో కూర్చొన్నా ఎక్కడ పాములు వస్తాయోనని కాలు కిందన పెట్టకుండా బయం భయంతో విధులు నిర్వహిస్తున్నని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వాతావరణం చల్లగా ఉండటంతో పాము బయటకు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.దీంతో పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వచ్చి మధ్యాహ్నం 1 గంట సమయంలో పామును పాట్టుకొని తరలించారు. అంత వరకు గోడకు ఉన్న పైప్ లైన్ లో పాము ఉండటంతో ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు భయపడ్డారు.పామును పెట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టరేట్ గోడలు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించక పోవడం వలన పాములు వంటి వాటికి నివాసంగా ఆ ప్రాంతం తయారు అయ్యింది. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం పిచ్చి మొక్కలు,పొదలు తీయించకపోతే పాములు ,చీడ పీడలు బయం వెంటాడుతూనే ఉంటుంది.