Jan 14,2023 16:17
  • రాజువొమ్మంగి సీఐ ఎస్కే బాజీలాల్

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ప్రజలు సంక్రాంతి పండుగను సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాలని రాజవొమ్మంగి నూతన సీఐ ఎస్కే బాజీలాల్ అన్నారు, రాజువమ్మంగి సీఐగా బాజీలాల్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన సిఐ రవికుమార్ కృష్ణాజిల్లా బదిలీ కాగా, అమలాపురం రూరల్ నుండి రాజవొమ్మంగి సీఏ గా ఎస్కే బాజీలాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐని  రాజవొమ్మంగి, జడ్డంగి  ఎస్సైలు టీజీ నరేంద్ర ప్రసాద్,షరీఫ్ లు పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ బాజీలాల్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  సంక్రాంతి పండుగ నేపథ్యంలో మండలంలో ఎక్కడైనా  కోడిపందాలు, గుండాట, పేకాట, చిత్తులాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడిపందాలకు ఎటువంటి  అనుమతులు ఇవ్వలేదని ప్రజల అపోహలు పడవద్దని తెలిపారు. ఈ  కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.