ప్రజాశక్తి-అల్లూరి : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం వలన పాడేరు ఐటిడిఎ పిఓ స్పందించి వెంటనే అరకు వేలి డిగ్రీ కళాశాల పాత భవనం మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు (తేదీన 8-7-2023న) అరకు వేలి జే ఇ అభిషేక్, అలాగే రూఫ్ రిపేర్ కాంట్రాక్టు దిలీప్ కుమార్ అరకువేలి డిగ్రీ కళాశాల పాత భవనం పరిశీలించి ఐటిడిఏ పిఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరమ్మతులు చేపడతామని, పెచ్చులు ఊడి పడిన గదులను పరిశీలించడం జరిగింది. జే ఇ అభిషేక్ మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి ముందు ఉంటానని ఈ భవనం వెంటనే మరమ్మతులు చేపడతామని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని మంచి మార్కులు సాధించి మంచి స్థాయిలో వెళ్లాలని అన్నారు. మహిళ వసతిగృహం 3 అంతస్తు భవనం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నానని అన్నారు. మహిళా వసతి గృహంలో ప్రహరి గోడ ఏర్పాట్లు చేయించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ పేపర్ స్టేట్మెంట్ చూసిన వెంటనే స్పందించిన ఐటిడిఏ పిఓకి అరకువేలి జేఇ అభిషేక్ కి అభినందనలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ ఎస్ గంగమ్మ, అరకు వేలి గర్ల్స్ కన్వీనర్ కె ధనలక్ష్మి, ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కె కొండమ్మ, మండల కమిటీ సభ్యులు కె శాంతి, ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు ఎస్ ఐసు బాబు, పి కృష్ణ, ఆదివాసిగిరిజన సంఘం మండల కార్యదర్శి పి రామన్న, డిగ్రీ కళాశాల లైబ్రరీ అధ్యాపకులు కామేష్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.










